స్థానిక తోటపాలెం లో గల సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో తేదీ 16 - 11 - 2022న రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరం సత్య విద్యా సంస్థల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మీ గారు మరియు సత్య విద్యాసంస్థల సంచాలకులు డాక్టర్. ఎం.శశి భూషణ్ రావు గారు ప్రారంభం చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని కళాశాల ఎన్సిసి మరియు ఎన్ఎస్ఎస్ విభాగాలు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎం ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ కలిసి సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ఎన్సిసి క్యాడేట్స్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ సీతం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విజయనగరం విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొని మొత్తం 63 మంది రక్తదానాన్ని చేశారు. ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మీ గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము మా విద్యాసంస్థల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఉంటామని, అంతేకాకుండా ఎక్కడ అవసరమైతే అక్కడకు మా విద్యార్థులు వెళ్లి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ ఉంటారని, ఈ విధంగా సంవత్సరం అంతా ఈ రక్తదానం కార్యక్రమం జరుగుతూ ఉంటుందని, అందుకు చాలా గర్వంగా ఉందని విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు. రక్తదానం ప్రాణదానం చేసినట్లే అని కావున విద్యార్థులు ఈ విధంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని కొనియాడారు. శశిభూషణ్ రావు గారు మాట్లాడుతు మనం ఇచ్చిన రక్తం వల్ల కొన్ని ప్రాణాలను నిలబెట్టిన వారిమి అవుతామని అందువలన నేటి యువతరం ముందుకు వచ్చి రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందము విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.